Nalgonda: ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి!
Nalgonda: రాష్ట్రంలో ప్రత్యేక వివరాల సేకరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం. కలెక్టర్ చంద్రశేఖర్‌తో వీసీ నిర్వహణ.
Nalgonda: ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి!
Nalgonda: ప్రత్యేక వివరాల సేకరణ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియను జిల్లాల్లో నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) పి.సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నోటీసులు పొందిన ఓటర్లు సమర్పించిన పత్రాలను బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌ఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో నోటీసుల జారీ తదనంతర విచారణ, పత్రాల పరిశీలన కొనసాగుతోందన్నారు. పత్రాలు లేని కేసుల్లో వాటిని వేగంగా సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఫామ్–7, 8లు అందుబాటులో ఉంచేలా బీఎల్‌ఓలను ఆదేశించామని, ఇప్పటికే ప్రత్యేక క్యాంపులు నిర్వహించడంతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తిచేశామని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌ఓ దశరథ తదితరులు పాల్గొన్నారు.




