Nalgonda: గుట్ట కింద అన్నారంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!
Nalgonda: గుట్ట కింద అన్నారం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.. ప్రధానోపాధ్యాయులు సైదులు, ఉపాధ్యాయురాలికి సన్మానం.
Nalgonda: గుట్ట కింద అన్నారంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!
Nalgonda: నల్లగొండ మండల పరిధిలోని గుట్ట కింద అన్నారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎం. సైదులు, ఉపాధ్యాయురాలు జి. గౌతమిలను పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ మైల మల్లికార్జున్ రెడ్డి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వారి భావిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




