Suryapet: సూర్యాపేటలో యూత్ కాంగ్రెస్ ఆగ్రహం.. మోడీ దిష్టిబొమ్మ దహనం!
Suryapet: నీట్ పరీక్షల రద్దు, పేపర్ లీకేజీకి నిరసనగా సూర్యాపేటలో యువజన కాంగ్రెస్ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసింది.
Suryapet: సూర్యాపేటలో యూత్ కాంగ్రెస్ ఆగ్రహం.. మోడీ దిష్టిబొమ్మ దహనం!
సూర్యాపేట: నీట్ పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపించారు. గత పదేళ్లుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాసినా, చివరికి పరీక్షలను రద్దు చేయడం వారి భవిష్యత్తుతో చెలగాటమేనని వారు మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పూర్తిగా విఫలమైందని, దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అనిశ్చితిలోకి నెట్టిందని పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన బీజేపీ విధానాలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, డిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ ఖలీద్ అహ్మద్, భవ్య, రోహిణి సూచనలతో నిర్వహించినట్లు తెలిపారు.
నిరసనలో నరేందర్ నాయుడు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి. వినయ్, సుదీర్, వికాస్, అబ్బాస్, శ్రీకాంత్, అఖిల్, నరేష్, శివ, లక్ష్మణ్, మహేష్, రఫీ, డి. శివ, మధు తదితరులు పాల్గొన్నారు.




