Suryapet: బొప్పారంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం!
Suryapet: బొప్పారంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి. ప్రజాసేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడి.
Suryapet: బొప్పారంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం!
Suryapet: ప్రజలకు మేలు చేసే సేవా కార్యక్రమాలే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.
ఆత్మకూర్(ఎస్) మండలంలోని బొప్పారం గ్రామంలో ఏలేటి భిక్షం రెడ్డి-మల్లమ్మ గార్ల జ్ఞాపకార్థం రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను శుక్రవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏలేటి ఉపేందర్ రెడ్డి-రేణుక రెడ్డి, వెంకట్ రెడ్డి-గాయత్రి, హర్విక రెడ్డి దాతలుగా ముందుకు వచ్చి గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించడం అభినందనీయమన్నారు.
బొప్పారం గ్రామంతో దామన్నకు (RDR) విడదీయరాని అనుబంధం ఉందని, ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని, గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించి గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
సెప్టెంబర్ 14న RDR జయంతి - సేవా దినోత్సవంగా నిర్వహించాలి
సెప్టెంబర్ 14న జరిగే దామన్న జయంతిని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలు కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం, తాగునీటి సదుపాయాలు, మొక్కల పెంపకం, విద్యార్థులకు సహాయం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలతో నిర్వహించినప్పుడే నిజమైన సార్థకత ఉంటుందన్నారు.
ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను నిరంతరం నిర్వహణలో ఉంచి ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను కాపాడుకోవడం గ్రామ ప్రజలందరి బాధ్యత అని సూచించారు.
గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాన్ని మరచిపోకుండా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బొప్పారం గ్రామ దాతలు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ఆత్మకూర్(ఎస్) మండల నాయకులు పాల్గొన్నారు.




