Suryapet: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్
Suryapet: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం రామన్నగూడెంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి 104 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Suryapet: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్
సూర్యాపేట: ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 104 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రామన్నగూడెం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఆత్మకూరు(ఎస్) పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అదే గ్రామానికి చెందిన అల్లిపురి అఖిల్(23), మట్టపల్లి గంగరాజు(22)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు(ఎస్) ఎస్సై ఐలయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా చదువు, ఉద్యోగం, క్రీడల వైపు దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




