Suryapet: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ – నంబర్ ప్లేట్ లేని 50 బైక్‌లు సీజ్
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. నంబర్ ప్లేట్లు లేని 50 ద్విచక్ర వాహనాలు సీజ్, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలని ఎస్ఐ హెచ్చరిక.
Suryapet: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ – నంబర్ ప్లేట్ లేని 50 బైక్‌లు సీజ్
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.
ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 50 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వాహన యజమానులతో అక్కడికక్కడే వాహనాలకు నంబర్ ప్లేట్లు వేయించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వాహనానికి నంబర్ ప్లేట్ లేకపోతే ప్రమాదం లేదా నేరం జరిగినప్పుడు వాహనాన్ని గుర్తించడం కష్టమవుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




