Suryapet: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ కోసం విద్యార్థుల భారీ ర్యాలీ

Suryapet: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్‌మెంట్ మార్పుపై విద్యార్థుల ఉగ్రరూపం. NH-65 వెంట బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయాలని డిమాండ్‌తో నిరసన.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 13 Aug 2026 7:42 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ కోసం విద్యార్థుల భారీ ర్యాలీ

సూర్యాపేట: జాతీయ రహదారి 65కి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో విద్యార్థి లోకం రోడ్లపైకి వచ్చింది. గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్లు విద్యార్థుల నిరసనలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి.

ఫిబ్రవరిలో జాతీయ రహదారి 65 సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ అలాట్‌మెంట్‌ను మంజూరు చేసి, అకస్మాత్తుగా అలైన్‌మెంట్‌ను మార్చే యోచన చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బుల్లెట్ ట్రైన్ కేటాయింపులో మోసం జరిగిందని నినదిస్తూ వేలాది మంది విద్యార్థులు ఉగ్రరూపం దాల్చారు.

పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు, కొత్త బస్టాండ్ ఏరియా, పీఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ తో పాటు వాణిజ్య భవన్ సెంటర్ వద్ద భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఈ ఉద్యమం ఢిల్లీ పీఠం కదిలే వరకు ఆగేది లేదని విద్యార్థి నేతలు హెచ్చరించారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానికులు కూడా విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వాణిజ్య భవన్ సెంటర్‌లో జరిగిన సభలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, సూర్యాపేటకు జరిగిన అన్యాయాన్ని అన్ని వర్గాలు గుర్తించి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్‌ను సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు పుల్లూరి సింహాద్రి, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, భాష పొంగు సునీల్, ఎర్ర అఖిల్, బొమ్మగాని వినయ్, భారీ అశోక్, పోలోజు మహేష్, అహ్మద్ అలీ, పారాల సాయి, పోలేబోయిన కిరణ్, షేక్ జహంగీర్, వెంకటేష్ నాయక్ తో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story