Suryapet: సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీ!
Suryapet: సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ వార్షిక తనిఖీ. తీవ్రమైన కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశం.
Suryapet: సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీ!
Suryapet: జిల్లా పోలీసు కార్యాలయాల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట డివిజన్ డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదివారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డీఎస్పీ దర్యాప్తు అధికారిగా వ్యవహరించే ఎట్రాసిటీ కేసులు, పోక్సో కేసులు, తీవ్రమైన చీటింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చట్ట ప్రకారం నిర్దేశించిన పరిమిత సమయంలోనే విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు.
జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, సిబ్బంది పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతర తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్, కార్డాన్ సెర్చ్‌లు, రోడ్డు భద్రతా ప్రమాణాల పెంపు నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు యాదవేందర్ రెడ్డి, మహేష్, అనిల్ రెడ్డి, స్టోర్ ఆర్ఎస్ఐ అశోక్, డీసీఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీ సందీప్, టెక్నికల్ కానిస్టేబుల్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




