Suryapet: కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీలు!

Suryapet: కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీలు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, శాంతిభద్రతలపై అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 27 Aug 2026 1:16 PM IST
Suryapet
X

Suryapet: కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీలు!

Suryapet: స్థానిక కోదాడ డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ రికార్డులు, వివిధ కేసుల దర్యాప్తు తీరు తెన్నులు, పోలీస్ స్టేషన్ల నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, శాఖపరమైన పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేసి, బాధితులకు త్వరగా న్యాయం అందేలా చూడాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే (బ్లాక్ స్పాట్స్) ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

తనిఖీలు మరియు సమీక్షా సమావేశం అనంతరం ఎస్పీ నరసింహ డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story