Suryapet: సోలిపేటలో సందడి.. పేదల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన సర్వోత్తమ్ రెడ్డి!

Suryapet: సూర్యాపేట సోలిపేటలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3500 ఇళ్లు ఇస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వెల్లడి.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 13 May 2026 1:09 PM IST
Suryapet
X

Suryapet: సోలిపేటలో సందడి.. పేదల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన సర్వోత్తమ్ రెడ్డి!

సూర్యాపేట: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో లబ్ధిదారురాలు పల్స జ్యోతి శివలింగం గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్ల పాటు ప్రజలను ఊరించిందని, ఒక్కరికీ కూడా పక్కా ఇల్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదవారికి సొంతిల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.

పేదల సంక్షేమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు చెరుకు వెంకన్న, గోగిరెడ్డి వెంకట్ రెడ్డి, చందా గోపాల్, ఉప సర్పంచ్ బొడ్డు రజిత, పీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యండి అంజద్ అలి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story