Suryapet: వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఎస్ఐ నాగరాజు కీలక ఆదేశాలు!

Suryapet: సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ సిటిజన్ల రక్షణ కమిటీ సమావేశం జరిగింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 22 July 2026 7:00 AM IST
Suryapet
X

Suryapet: వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఎస్ఐ నాగరాజు కీలక ఆదేశాలు!

సూర్యాపేట: వయోవృద్ధుల భద్రత, సంక్షేమే తమ ప్రథమ ప్రాధాన్యత అని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జిల్లా ఎస్‌.పి నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు మంగళవారం నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ సిటిజన్ల రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.

స్టేషన్‌లో జరిగిన ఈ సమావేశానికి కమిటీకి చెందిన ఐదుగురు సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్.ఐ నాగరాజు మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా నివసిస్తున్నా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. వారి భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.

సీనియర్ సిటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, వృద్ధులు నివసించే ప్రాంతాల్లో రాత్రి వేళ గస్తీని పెంచాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో నూతన్‌కల్ ఎస్‌ఐ నాగరాజు పాల్గొని, కమిటీ సభ్యులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

వృద్ధుల సంక్షేమే ధ్యేయంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చొరవ స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story