Suryapet: సూర్యాపేటలో రౌడీషీటర్లకు ముందస్తు పోలీస్ కౌన్సిలింగ్!
Suryapet: సూర్యాపేటలో వినాయక చవితి వేళ రౌడీషీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్. 30 మందిపై బైండోవర్ కేసులు, శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలని సీఐ హెచ్చరిక.
Suryapet: సూర్యాపేటలో రౌడీషీటర్లకు ముందస్తు పోలీస్ కౌన్సిలింగ్!
Suryapet: వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సూర్యాపేట పట్టణ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్లు, పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సమస్యాత్మక వ్యక్తులకు ముందస్తు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టౌన్ సీఐ వెంకటయ్య మాట్లాడుతూ.. పండుగ సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
పట్టణంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న సుమారు 30 మందికి పైగా వ్యక్తులపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు లేదా గొడవలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు అజయ్, సందీప్ రెడ్డి, కనకరత్నం, పోలీసు సిబ్బంది శ్రీరాములు, రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.




