Suryapet: ఎన్హెచ్-65పై బ్లాక్ స్పాట్ల పరిశీలన - అధికారుల ఆకస్మిక తనిఖీ

Suryapet: సూర్యాపేటలో NH-65పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను అధికారులు పరిశీలించారు. ఆక్రమణలను తొలగించి, భద్రతా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 3 Sept 2026 8:16 PM IST
Suryapet
X

Suryapet: ఎన్హెచ్-65పై బ్లాక్ స్పాట్ల పరిశీలన - అధికారుల ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట: చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి NH-65 పై రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు గురువారం ఉమ్మడిగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు.

సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట ఆర్డీఓ ఆధ్వర్యంలో NHAI అధికారులు, RTO అధికారులు కలిసి రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు భద్రతా ప్రమాణాలను అంచనా వేసి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

వాహనాల వేగాన్ని నియంత్రించడం, అవసరమైన చోట్ల హెచ్చరిక సైన్ బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారిని ఆక్రమించి వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలను గుర్తించారు.

ఆక్రమణదారులకు అక్కడికక్కడే నోటీసులు జారీ చేసి, వెంటనే తొలగించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చివ్వెంల పోలీస్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story