Suryapet: సూర్యాపేట ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం
Suryapet: సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు.
Suryapet: సూర్యాపేట ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.
బుధవారం కొత్త బస్ స్టాండ్ ప్రాంతాన్ని డీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ, ట్రాఫిక్ ఎస్సై, ఆర్టీసీ అధికారులు వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని అన్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు సిగ్నల్స్ కు అనుగుణంగా రాకపోకలు సాగించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించవద్దని సూచించారు. కొత్త బస్ స్టాండ్ వద్ద నెలకొన్న రద్దీ సమస్యను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
పాత బస్ స్టాండ్ కు రోజూ బస్సులను నడుపుతున్నామని ఆయన చెప్పారు. కోర్ట్ చౌరస్తా వద్ద బస్సులు తిప్పుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.




