Nakirekal: గుండెపై ఎమ్మెల్యే టాటూ.. వేముల వీరేశంపై అభిమాని వినూత్న ప్రేమ!
Nakirekal: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంపై తనకున్న అభిమానాన్ని సూర్యాపేటకు చెందిన మొండికత్తి వెంకన్న వినూత్నంగా చాటుకున్నారు.
Nakirekal: గుండెపై ఎమ్మెల్యే టాటూ.. వేముల వీరేశంపై అభిమాని వినూత్న ప్రేమ!
Nakirekal: సూర్యాపేట పట్టణానికి చెందిన మొండికత్తి వెంకన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన గుండెపై ఎమ్మెల్యే వేముల వీరేశం ట్యాటో చిత్రాన్ని గీయించుకొని ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు.
ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన అభిమాని
నేడు ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మర్యాదపూర్వకంగా కలిసి ఈ టాటూ చూయించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంకన్న గారి ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ప్రేమే నాకు బలం అని ఎమ్మెల్యే వేముల అన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం , ప్రజల ప్రేమాభిమానాలు తనకు మరింత బాధ్యతను గుర్తుచేస్తాయని అన్నారు. ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. అభిమానుల ఆదరణే తనకు బలం అని తెలిపారు.




