Suryapet: కాంగ్రెస్ 'దగా పాలన'పై మండిపడ్డ బీఆర్‌ఎస్ మద్దిరాలలో భారీ నిరసన!
Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరసన. హామీల అమలు, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్.
Suryapet: కాంగ్రెస్ 'దగా పాలన'పై మండిపడ్డ బీఆర్‌ఎస్ మద్దిరాలలో భారీ నిరసన!
Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులుగా కొనసాగిస్తున్న దగా పాలనను నిరసిస్తూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మద్దిరాల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.ఏ. రజాక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన 24 గంటల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక సహాయం, పెన్షన్ల పెంపు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు తదితర హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి తక్షణమే నిధులు విడుదల చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వడ్డాణం మధుసూదన్, గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ మల్లాల నర్సయ్య, వార్డు సభ్యులు సాధు నిర్మల రఘు, మల్లాల రాంమూర్తి, భూతం రమలింగయ్య, సీనియర్ నాయకులు వడ్డాణం సత్యనారాయణ, చామకూరి సోమయ్య, బిక్షం, బీఎస్ ముదిరాజ్, కొలగాని వెంకన్న, శేరి దామోదర్‌రెడ్డి,
వీరారెడ్డి, సాధు భాస్కర్‌రెడ్డి, పాక వీరయ్య, వెంకన్న, వల్లపు నరేష్, శ్రీను, అంకటి కుమారస్వామి, అచ్చ శరత్‌బాబు, మట్టిపెళ్లి శ్రీను, బాషబోయిన నాగయ్య, మల్లాల వెంకటనర్సు, ఉప్పలయ్య, చామకూరి యాకయ్య, పాక సందీప్, రాంపాక సుధాకర్, రవీందర్, పరమేష్, ఆగయ్య, బొందెకోల విజయ్, ఉయ్యాల చంటి, పోతరాజు లింగయ్య, ఆవిలయ్య తదితరులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.




