Suryapet: అన్నదాతలకు సూర్యాపేట ఎస్పీ కీలక విజ్ఞప్తి!
Suryapet: సూర్యాపేట జిల్లాలో రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభమైన వేళ.. నకిలీ విత్తనాలపై జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ రైతులను అప్రమత్తం చేశారు.
Suryapet: అన్నదాతలకు సూర్యాపేట ఎస్పీ కీలక విజ్ఞప్తి!
సూర్యాపేట: రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు మొదలైన నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ రైతాంగానికి అన్నదాతలకు నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పత్తి, మిర్చి, వరి సాగు చేసే రైతులు గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మే దళారుల వద్ద విడి, లూజు విత్తనాలు కొనవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి ఉన్న అధీకృత విత్తన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, సర్టిఫైడ్ ప్యాకింగ్, రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.
నాణ్యతలేని, శుద్ధిచేయని నకిలీ విత్తనాలు వాడితే దిగుబడి తగ్గడమే కాకుండా రైతు శ్రమ వృధా అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి విత్తనాలు అమ్మే వ్యాపారులు, దళారులపై విత్తనాల చట్టం, బీఎన్ఎస్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.
పోలీస్ శాఖ లూజుగా బ్యాగుల్లో విత్తనాలు అమ్మే వ్యాపారులపై నిఘా పెట్టిందని ఎస్పీ తెలిపారు. రైతులు ఏదైనా అనుమానం ఉన్నా, నకిలీ విత్తనాల సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100, 112 లేదా సూర్యాపేట కంట్రోల్ రూమ్ 8712686026కు సమాచారం ఇవ్వాలని, వ్యవసాయాధికారులను సంప్రదించాలని కోరారు.




