Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి - కలెక్టర్ ఆదేశం

Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించబడుతుంది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 10 May 2026 8:10 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి - కలెక్టర్ ఆదేశం

సూర్యాపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత చేరువగా ఉండేందుకు ఇక నుంచి ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు.

మే 10న ఆయన విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో మాత్రమే జరిగే ప్రజావాణి, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం ఆర్‌డీఓ కార్యాలయాల్లో జరుగుతుంది.

డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓలను ఆయన ఆదేశించారు. డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను స్థానిక ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో నేరుగా సమర్పించవచ్చు.

ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షత వహిస్తారని, డివిజన్ పరిధిలోని అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ చర్యతో గ్రామీణ ప్రాంత ప్రజలకు సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story