Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ సెల్ ఫోన్ రికవరీ మేళా!
Suryapet: సూర్యాపేట జిల్లాలో 12వ సెల్ ఫోన్ రికవరీ మేళా ఘనంగా జరిగింది. రూ. 20 లక్షల విలువైన 103 ఫోన్లను బాధితులకు ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అందజేశారు.
Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ సెల్ ఫోన్ రికవరీ మేళా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీసులు 12వ సారి నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో 20 లక్షల విలువైన 103 ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ చేతుల మీదుగా సోమవారం పోలీస్ కార్యాలయంలో ఫోన్లు పంపిణీ చేశారు. సంవత్సర కాలంలో మొత్తం 1635 ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్ https://www.ceir.gov.in లో నమోదు చేసి, మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
"ఫ్రెండ్లీ పోలీస్ సామాన్యులకే. నేరస్తులకు కాదు. ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్ లా వ్యవహరించాలి" అని ఎస్పీ పిలుపునిచ్చారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సైబర్ వారియర్స్ కృషిని ఎస్పీ అభినందించారు. ఫోన్లు అందుకున్న బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.




