Suryapet: పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కలెక్టర్ తేజస్ పవార్

Suryapet: తుంగతుర్తిలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, నిర్లక్ష్యం వహించిన 16 మంది కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 9 Sept 2026 7:51 AM IST
Suryapet
X

Suryapet: పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కలెక్టర్ తేజస్ పవార్

Suryapet: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంగళవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, విబి-జి రాంజి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విబి-జి రాంజి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రోజువారీ కూలీలకు నిరంతరం పని కల్పించాలన్నారు.

ప్రతి కూలీకి రోజుకు కనీసం రూ.300 వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ మొబిలైజేషన్ ను తక్షణమే పెంచాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద మంజూరైన ఇందిరమ్మ మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన పేమెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

డ్రైన్ అండ్ సోక్ పిట్లు, విఓ/ఎస్హెచ్జీ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్డీవోను ఆదేశించారు.

అలాగే విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఒక ఏపీఓ, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఈసీ పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story