Suryapet: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: సూర్యాపేట కలెక్టర్!
Suryapet: సూర్యాపేట జిల్లా ప్రజావాణి దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.
Suryapet: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: సూర్యాపేట కలెక్టర్!
సూర్యాపేట: ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, కొత్తగా వచ్చే దరఖాస్తులను వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
ప్రతి అధికారి తమ లాగిన్‌లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, లేనియెడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మండల స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల మండల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయి సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు.
ఈ నెల 25 నుండి జరిగే వనమహోత్సవంలో సంబంధిత జిల్లా అధికారులందరూ పాల్గొని నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేయాలని, జిల్లా, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగస్టు 31 లోగా టీ-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 68 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో భూ సమస్యలకు సంబంధించి 43, ఇరిగేషన్ 4, మున్సిపాలిటీ 4, డీడబ్ల్యూఓ 3, మిగిలిన 14 వివిధ శాఖలకు చెందినవని, వాటిని పరిష్కారానికి శాఖల వారీగా పంపించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, సీపీఓ కిషన్, డీఎస్ఓ మోహన్ బాబు, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




