Suryapet: NH-65 మీదుగా బుల్లెట్ ట్రైన్ కోసం ఉద్యమం - నరేందర్ గౌడ్

Suryapet: జాతీయ రహదారి 65 సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా ప్రతిపాదనలు వచ్చే వరకు ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్ పిలుపు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 5 Sept 2026 9:33 PM IST
Suryapet
X

Suryapet: NH-65 మీదుగా బుల్లెట్ ట్రైన్ కోసం ఉద్యమం - నరేందర్ గౌడ్

సూర్యాపేట: కేంద్రం ముందుగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను జాతీయ రహదారి 65 సూర్యాపేట మీదుగా వెళ్లే విధంగా ప్రతిపాదనలు వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు.

శనివారం బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో 23వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో కూర్చున్న మలిదశ ఉద్యమకారులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు బుల్లెట్ ట్రైన్ ను మొదటి అలైన్‌మెంట్ ప్రకారమే నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ దీక్షకు న్యాయవాది సత్యనారాయణ పిళ్ళై, జర్నలిస్టులు కందుకూరు యాదగిరి, ఉయ్యాల నరసయ్య, కరాటే మాస్టర్ సయ్యద్, భయ్యా మల్లికార్జున్, చీకూరు శ్రీనివాస్, బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష కమిటీ సభ్యులు సంఘీభావం తెలిపారు.

దీక్షలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు సట్టు నాగయ్య, వెలుగు వనితక్క, చకిలం రవి ప్రసాద్, మామిడి శెట్టి అంజయ్య, దొండ శ్రీను, లింగంపల్లి మురళి, ఎస్ కే సలీం, గొనె విజయ, వీరమనేని సత్యనారాయణ రావు, నోముల ఉమాదేవి, అయూబ్ పాషా, దువ్వగిరి మేడబోయిన గంగయ్య, సికిందర్, దారా నిలిని, మాచర్ల రామ లక్ష్మమ్మ, సట్టు మహేశ్వరి, కే సుజాత తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story