Suryapet: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు ఎస్సై ఐలయ్య హెచ్చరిక!

Suryapet: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో 'ఎరైవ్ ఎలైవ్' రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 21 July 2026 5:18 PM IST
Suryapet
X

Suryapet: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు ఎస్సై ఐలయ్య హెచ్చరిక!

సూర్యాపేట: ​ఆత్మకూర్ (ఎస్): సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్.ఐ ఐలయ్య ఆధ్వర్యంలో 'ఎరైవ్ ఎలైవ్' (Arrive Alive) ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు, స్థానిక ప్రజలకు రహదారి భద్రత మరియు నిబంధనలపై ఎస్సై ఐలయ్య ముఖ్యమైన సూచనలు చేశారు.

​ప్రమాదాల నివారణే ధ్యేయం, ఈ ​కార్యక్రమంలో ఎస్సై ఐలయ్య మాట్లాడుతూ ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఎస్పీ గారి సూచనల మేరకు 'ఎరైవ్ ఎలైవ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు స్వల్ప అలసత్వం వల్ల అమూల్యమైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

​హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ​మద్యం మత్తులో డ్రైవింగ్ వద్దు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని, అది మీతో పాటు ఎదుటివారి ప్రాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.

​అతివేగం నిషిద్ధం పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకూడదని కోరారు. ​డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడకూడదు: ప్రయాణంలో ఫోన్ మాట్లాడటం దృష్టిని మళ్లించి ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. ​మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి భవిష్యత్తును, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

​వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటిస్తూ, పోలీసు శాఖకు సహకరించాలని మరియు ప్రాణ నష్టం జరగకుండా సురక్షితమైన ప్రయాణం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక వాహనదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story