Suraypet: మొరాయిస్తున్న ఫర్టిలైజర్ యాప్ రైతులకు తప్పని తిప్పలు!
Suraypet: ఫర్టిలైజర్ యాప్ మొరాయించడంతో సూర్యాపేట జిల్లాలో రైతులకు తప్పని తిప్పలు. యూరియా బుకింగ్ కాక, అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల తీవ్ర ఆవేదన.
Suraypet: మొరాయిస్తున్న ఫర్టిలైజర్ యాప్ రైతులకు తప్పని తిప్పలు!
Suraypet: పంటలకు యూరియా అత్యవసరంగా అవసరమవుతున్న వేళ ఫర్టిలైజర్ యాప్ మొరాయించడం రైతులకు శాపంగా మారింది.
యూరియా కోసం యాప్ లో బుక్ చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే రైతులు యాప్ లో బుకింగ్ కోసం ప్రయత్నిస్తుంటే సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. గంటల తరబడి ప్రయత్నించినా బుకింగ్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు పంటకు ఎరువు వేసే సమయం దగ్గర పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాప్ పనిచేయకపోవడంతో ఎరువుల దుకాణాలు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే "ఈ సమస్య మా పరిధిలో లేదు, మేమేమీ చేయలేం" అంటూ చేతులెత్తేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలని తీసుకొచ్చిన యాప్ లే ఇప్పుడు ఇబ్బందిగా మారాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాప్ పనిచేయక రైతు యూరియా బుక్ చేసుకోలేకపోతే దానికి బాధ్యులు ఎవరని, పంట నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యాప్ లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.




