Nalgonda: గణేష్ మండపాలకు డీజేలపై నిషేధం: నల్లగొండ ఎస్పీ!
Nalgonda: వినాయక చవితి నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని, ఆన్‌లైన్ పోర్టల్‌లో అనుమతులు పొందాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
Nalgonda: గణేష్ మండపాలకు డీజేలపై నిషేధం: నల్లగొండ ఎస్పీ!
నల్లగొండ: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ప్రజా సౌకర్యం, శాంతిభద్రతల దృష్ట్యా ఉత్సవ కమిటీలు విధిగా పోలీస్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
ఉత్సవాల్లో డీజేల వినియోగానికి అనుమతి లేదు. స్పీకర్లను తక్కువ శబ్దంతో రాత్రి 10 గంటల వరకే అనుమతిస్తామని ఎస్పీ తెలిపారు.మండప నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in ద్వారా వివరాలు నమోదు చేసి, ఆ ప్రతులను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని కోరారు.
Next Story




