Nalgonda: ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి: నల్గొండ ఎస్పీ!

Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ బాధితుల నుంచి 36 అర్జీలను స్వీకరించారు.

Saleem, Nalgonda
Published on: 17 Aug 2026 7:23 PM IST
Nalgonda
X

Nalgonda: ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి: నల్గొండ ఎస్పీ!

నల్గొండ:​ ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు వేగంగా న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 36 మంది బాధితుల నుంచి భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలపై వినతులను స్వీకరించారు.

ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం విచారణ జరపాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం వహించవద్దని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story