Suryapet: మోదీ సభకు సూర్యాపేట నుండి కదిలిన కాషాయ దళం!
Suryapet: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సూర్యాపేట నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.
Suryapet: మోదీ సభకు సూర్యాపేట నుండి కదిలిన కాషాయ దళం!
సూర్యాపేట: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు బారి ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరారు. హైదరాబాద్‌లో జరిగే చారిత్రాత్మక సభతో పాటు రాష్ట్ర ప్రగతికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ రావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివెళ్లారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ భారీ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అజేయ శక్తిగా ఎదుగుతోంది. మాటలు కాకుండా చేతలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మోదీ గారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నేడు జరగబోయే శంకుస్థాపనలే నిదర్శనం. జాతీయ రహదారుల విస్తరణ నుంచి రైల్వే ప్రాజెక్టుల వరకు కేంద్రం అందిస్తున్న భారీ నిధులు తెలంగాణ అభివృద్ధికి వెన్నుముకగా నిలిచాయి” అని అన్నారు.
“సూర్యాపేట ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన మోదీ గారికి ఘన స్వాగతం పలకడానికి మనం వెళ్తున్నాం. ఈ పర్యటన తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మోదీ గారి వెంట నడవాల్సిన సమయం వచ్చింది. మన ప్రధానిని మన రాష్ట్ర గడ్డపై చూసుకోవడం మనందరికీ గర్వకారణం” అని సంకినేని వెంకటేశ్వరావు ఉద్వేగంగా పేర్కొన్నారు. మోదీ గారి “సబ్ కా సాత్, సబ్ కా వికాస్” మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సభ ఒక వేదికగా మారుతుందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.




