Suryapet: ఆత్మకూర్ (ఎస్) పీహెచ్‌సీలో సాధారణ కాన్పు.. పండంటి బాబు జననం!
Suryapet: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) పీహెచ్‌సీలో వైద్యులు విజయవంతంగా సాధారణ కాన్పు చేశారు.
Suryapet: ఆత్మకూర్ (ఎస్) పీహెచ్‌సీలో సాధారణ కాన్పు.. పండంటి బాబు జననం!
సూర్యాపేట: ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో సురక్షిత సాధారణ కాన్పు విజయవంతంగా నిర్వహించారు. ఆత్మకూర్ (ఎస్) గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి (29, రెండో కాన్పు) గురువారం పురిటి నొప్పులతో పీహెచ్‌సీలో చేరారు. వెంటనే స్పందించిన డ్యూటీ వైద్యాధికారిణి డాక్టర్ రమ్య తన సిబ్బందితో కలిసి ఆపరేషన్ లేకుండా సాధారణ ప్రసవం (Normal Delivery) చేశారు. భాగ్యలక్ష్మి ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు.
ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ రమ్య తెలిపారు. సకాలంలో స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్ రమ్య, సిబ్బందిని బాలింత కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన ప్రసవ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని వైద్య సిబ్బంది కోరారు. ఈ కాన్పులో నర్సింగ్ ఆఫీసర్ మానస, OP ANM మహబూబా, ఆత్మకూర్ ANM అన్నపూర్ణ, ఆశా వర్కర్ మాధవి, CHO యాదగిరి, హెల్త్ అసిస్టెంట్ కొండా శ్రీను పాల్గొన్నారు.




