Nalgonda: రైస్ మిల్లర్లపై అధికారుల వేధింపులు ఆపాలి: నల్లగొండ మిల్లర్ల సంఘం డిమాండ్!

Nalgonda: నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్లపై అధికారుల వేధింపులు ఆపాలని, ప్రభుత్వం పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిల్లుల బంద్ కొనసాగిస్తున్నారు.

Saleem, Nalgonda
Published on: 2 Sept 2026 10:23 PM IST
Nalgonda
X

Nalgonda: రైస్ మిల్లర్లపై అధికారుల వేధింపులు ఆపాలి: నల్లగొండ మిల్లర్ల సంఘం డిమాండ్!

నల్లగొండ: రాష్ట్ర ప్రగతికి రైతు ఒక కన్నయితే.. రైస్ మిల్లరు మరో కన్ను. రైతు-మిల్లరు ఇద్దరూ బాగుంటేనే దేశం బాగుంటుంది" అని నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు. మిల్లులపై అధికారుల వేధింపులు ఆపాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మిల్లుల మూసివేత కొనసాగుతోందని తెలిపారు.

బకాయిలు ఉన్న మిల్లులపై తనిఖీలు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బకాయిలు లేని మిల్లులను కూడా తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. 90 శాతం మంది మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం మానుకోవాలన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story