Nakrekal: సెప్టెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి సభ.. భారీగా తరలిరావాలని కాంగ్రెస్ పిలుపు!

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 31 Aug 2026 3:28 PM IST
Nakrekal
X

Nakrekal: సెప్టెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి సభ.. భారీగా తరలిరావాలని కాంగ్రెస్ పిలుపు!

నకిరేకల్: సెప్టెంబర్ 5 న నకిరేకల్ లో జరిగే సీఎం సభకు మండలం లో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లు జన సమీకరణ కోసం ఈ రోజు మండల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.

ఈ సందర్భంగా గాథగొని కొండయ్య పీసీసీ డెలిగేట్ ఏసుపాదం pacs చైర్మన్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్టం లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు పొందుతూ సంతోషంగా ఉన్నారని అన్నారు.

సీఎం రాక వలన నియోజక వర్గంలో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మన ఎమ్మెల్యే వేముల వీరేశం కి అందరం మద్దతు గా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్పంచులు విరార్జున్ రెడ్డి నకిరేకంటి నరేందర్ స్వప్న కృష్ణవేణి వెంకట చారి యాదగిరి రెడ్డి జన్రెడ్డి యల్లేష్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story