Suryapet: సూర్యాపేటలో రావుస్ ఫార్మా కార్మికుల ఆందోళన!

Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రావుస్ ఫార్మా యాజమాన్య తీరుపై కార్మికుల ధర్నా. 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలతో కలిసి ఆందోళన.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 26 Aug 2026 12:35 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో రావుస్ ఫార్మా కార్మికుల ఆందోళన!

Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని రావుస్ ఫార్మా కంపెనీ యాజమాన్య వైఖరికి నిరసనగా కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కంపెనీ ప్రధాన గేటు ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు.

గత ఐదు నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా రేపు, మాపు అంటూ దాటవేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో రాత్రింబవళ్లు వెట్టి చాకిరీ చేయించుకుని, తీరా జీతాలు అడిగితే నిమ్మకు నీరెత్తెనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఇళ్ల అద్దెలు కట్టలేక, పెళ్ళాం పిల్లలను పోషించుకోలేక పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.

అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తమ బాధలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని గగ్గోలు పెట్టారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు, కార్మిక శాఖ అధికారులు తక్షణమే స్పందించి రావుస్ ఫార్మా యాజమాన్యంతో మాట్లాడి, తమకు రావాల్సిన బాకీ జీతాలను వెంటనే ఇప్పించి ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story