Suryapet: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ ప్రొఫెసర్ జానకి రెడ్డి అరెస్ట్!

Suryapet: నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ జానకి రెడ్డి ముందస్తు అరెస్ట్.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 5 Sept 2026 12:28 PM IST
Suryapet
X

Suryapet: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ ప్రొఫెసర్ జానకి రెడ్డి అరెస్ట్!

Suryapet: నకిరేకల్ పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో సూర్యాపేట పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమ కన్వీనర్, ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ జానకి రెడ్డిని అరెస్ట్ చేశారు.

శుక్రవారం ఉదయం సూర్యాపేట పట్టణ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి, స్టేషన్‌లో సంతకం చేయాలంటూ తీసుకెళ్లి స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని అఖిలపక్ష పోరాట కమిటీ తెలిపింది.

నకిరేకల్‌లో జరిగే సీఎం సభకు సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ సందర్భంగా ఎలాంటి నిరసనకు పిలుపు కూడా ఇవ్వలేదని కమిటీ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎలాంటి నోటీసు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్‌లో నిర్బంధించడం అమానుషమని పేర్కొంది.

ప్రొఫెసర్ జానకి రెడ్డి అరెస్ట్‌ను అఖిలపక్షాలు, సామాజిక సంఘాలు, మేధావులు, విద్యా, ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ, సూర్యాపేట పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న నేతను ఇలా ముందస్తుగా అరెస్ట్ చేయడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story