Suryapet: సూర్యాపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్: 26 బైక్‌లు, 6 కార్లు స్వాధీనం

Suryapet: సూర్యాపేట రూరల్‌లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Jun 2026 8:46 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్: 26 బైక్‌లు, 6 కార్లు స్వాధీనం

సూర్యాపేట: జిల్లా ఎస్పీ నరసింహ IPS ఆదేశాలతో నేర నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావం పెంచేందుకు సూర్యాపేట రూరల్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మెరుపు తనిఖీలు నిర్వహించారు.

సూర్యాపేట రూరల్ పరిధిలోని అంజనాపురి, మానస నగర్ కాలనీల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ చేపట్టారు. డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్‌తో కలిసి 80 మందికి పైగా సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేశారు.

ఈ సోదాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వచ్చి పనిచేస్తున్న కూలీల వ్యక్తిగత వివరాలు, నివాస గుర్తింపు పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 6 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, అప్రమత్తతతోనే నేరాలు నివారించవచ్చని తెలిపారు. సైబర్ మోసాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వాహనదారులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్తగా ఇళ్లు అద్దెకిచ్చేటప్పుడు అద్దెదారుల గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చెక్ చేసు కోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కాలనీకి రక్షణ వలయంలా ఉపయోగపడతాయని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రజలు భాగస్వాములైతేనే సురక్షిత సమాజం సాధ్యమని డీఎస్పీ అన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story