Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం.. దుకాణంలోకి దూసుకెళ్లిన కారు!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని రహమత్ నగర్ ప్రధాన రహదారిపై వేకువజామున అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది.
Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం.. దుకాణంలోకి దూసుకెళ్లిన కారు!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని రహమత్ నగర్ ప్రధాన రహదారిపై శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 5:00 గంటల ప్రాంతంలో అతివేగంతో వచ్చిన ఓ బలేనో కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో దుకాణం షెట్టర్లు వేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం ఐరన్ రేకులా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story




