Nalgonda: మరమ్మతులకు నోచుకోని ఓపెన్ జిమ్ ఇబ్బందుల్లో వాకర్లు!

Nalgonda: నల్గొండ ఎన్‌జీసీ కాలేజీ ఆవరణలోని ఓపెన్ జిమ్ సరైన నిర్వహణ లేక అధ్వానంగా తయారైంది.

Saleem, Nalgonda
Published on: 1 Aug 2026 11:41 AM IST
Nalgonda
X

Nalgonda: మరమ్మతులకు నోచుకోని ఓపెన్ జిమ్ ఇబ్బందుల్లో వాకర్లు!

Nalgonda: నల్గొండ పట్టణంలోని ప్రసిద్ధ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్‌జీసీ) ఆవరణలోని ఓపెన్ జిమ్ అధ్వానంగా తయారైంది. సరైన నిర్వహణ లేక పరికరాలు శిథిలావస్థకు చేరడంతో వ్యాయామం చేసేందుకు వచ్చే వాకర్లు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న పరికరాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాది మంది వాకర్లు, విద్యార్థులు, మహిళలు ఆరోగ్యం కోసం ఈ జిమ్‌ను వినియోగిస్తున్నారు. అయితే కీలకమైన పరికరాలు పనిచేయకపోవడంతో వ్యాయామాన్ని సగం లోనే నిలిపివేసి నిరాశతో వెనుతిరుగుతున్నారు.

​జిల్లా అధికారులు, సంబంధిత శాఖాధికారులు తక్షణమే స్పందించి పాడైన పరికరాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story