Kodad: ఖానాపురం పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. 2 లక్షల విరాళం

Kodad: కోదాడ మండలం ఖానాపురం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 11 July 2026 8:26 PM IST
Kodad
X

Kodad: ఖానాపురం పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. 2 లక్షల విరాళం

కోదాడ: కోదాడ మండలం ఖానాపురం గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ నీలం మధు ముదిరాజ్ గారు తనవంతు ఆర్థిక సహకారాన్ని అందించారు.

​ఖానాపురం గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మరియు కోదాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు హైదరాబాద్‌లో నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని వినతిపత్రం సమర్పించారు.

వీరి అభ్యర్థనపై నీలం మధు ముదిరాజ్ గారు వెంటనే స్పందించి, ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయల) విరాళాన్ని ప్రకటించి అందజేశారు.

ఈ సందర్భంగా ఖానాపురం ముదిరాజ్ కుల సభ్యులు మరియు కోదాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు నీలం మధు ముదిరాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story