Nalgonda: పంచాయతీ నిధుల కలకలం పనులు చేయకుండానే రూ.7 లక్షల డ్రా!

Nalgonda: నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్‌పై నిధుల దుర్వినియోగం ఆరోపణలు. రూ.7 లక్షల నకిలీ బిల్లులపై అధికారుల ఆకస్మిక విచారణ, రికార్డుల స్వాధీనం.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 13 Aug 2026 5:16 PM IST
Nalgonda
X

Nalgonda: పంచాయతీ నిధుల కలకలం పనులు చేయకుండానే రూ.7 లక్షల డ్రా!

Nalgonda: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేశారన్న ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు.గ్రామ సర్పంచ్ ఐతగోని మధు రూ.7 లక్షల నిధులను పనులు చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి డ్రా చేశారని గ్రామానికి చెందిన లకుమల మధుబాబు అధికారులకు ఫిర్యాదు చేశారు.

​ఫిర్యాదుపై స్పందించిన అధికారులు వెంటనే ఎర్రబెల్లి గ్రామానికి చేరుకున్నారు.ఫిర్యాదుదారుడు సమక్షంలో పంచాయతీ రికార్డులు, బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తదుపరి విచారణ కోసం సంబంధిత పత్రాలను తమ స్వాధీనం చేసుకున్నారు.

​ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, త్వరలోనే నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగం నిజమే తేలితే సర్పంచ్‌పై కఠిన చర్యలు తప్పవన్న చర్చ గ్రామస్థుల మధ్య జోరుగా సాగుతోంది.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story