Nalgonda: నల్గొండ భర్తను చంపిన భార్య, ప్రియుడు అరెస్ట్
Nalgonda: నర్సాపూర్‌లో గోవింద్ హత్య కేసును ఛేదించిన వాడపల్లి పోలీసులు. వివాహేతర సంబంధమే కారణమని వెల్లడి. భార్య సరోజ, ప్రియుడు శ్రీను అరెస్ట్.
Nalgonda: నల్గొండ భర్తను చంపిన భార్య, ప్రియుడు అరెస్ట్
నల్గొండ: నల్గొండ జిల్లా దామచర్ల మండలం నర్సాపూర్ గ్రామంలో ఈనెల 11వ తేదీన జరిగిన ఇస్లావత్ గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు చేదించారు. గోవింద్ భార్య ఇస్లావత్ సరోజ కు అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీనుతో ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం గోవింద్ కు తెలవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో గోవింద్ ను అడ్డు తొలగించుకోవాలని సరోజ శ్రీను సమయం కోసం వేచి చూశారు.
ఈనెల 11న గోవిందు ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు కలిసి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేయడంతో పాటు సరోజ రోకలి బండతో భర్త గోవిందు వృషణాలపై కొట్టింది గోవింద్ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత రక్తపు మరకల బట్టలను సెల్ఫోన్లను దాచి ఇద్దరు పరారయ్యారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన వాడపల్లి పోలీసులు వీరిద్దరూ నిర్జీవ ప్రదేశంలోని చెట్లపొదల్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు




