Nalgonda: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రతులు దగ్ధం చేసిన రైతులు

Nalgonda: కేంద్ర ప్రభుత్వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నాయంటూ నల్లగొండలో రైతు సంఘాలు ప్రతులు దగ్ధం చేసి నిరసన తెలిపాయి.

Saleem, Nalgonda
Published on: 10 Aug 2026 12:34 PM IST
Nalgonda
X

Nalgonda: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రతులు దగ్ధం చేసిన రైతులు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి: రైతు, కార్మిక సంఘాల డిమాండ్

​కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు డిమాండ్ చేశారు. ఎస్‌కేఎం పిలుపు మేరకు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ‘జైల్ భరో’ నిరసన ప్రదర్శన నిర్వహించి, ఒప్పంద ప్రతులను దగ్ధం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story