Nalgonda: పాత ఇనుప సామాను దుకాణంలో బ్యాలెట్ బాక్స్!
Nalgonda: నల్గొండ కలెక్టరేట్ సమీపంలోని పాత ఇనుప సామాను దుకాణంలో బ్యాలెట్ బాక్స్ ప్రత్యక్షం. భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా గుర్తింపు. అధికారుల విచారణ.
Nalgonda: పాత ఇనుప సామాను దుకాణంలో బ్యాలెట్ బాక్స్!
నల్గొండ: నల్గొండ పట్టణంలో సంచలనం రేపే ఘట న వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టరేట్‌కు సమీపంలోని ఒక పాత ఇనుప సామాను దుకాణంలో తెలంగాణ ఎన్నికల సంఘానికి చెందిన బ్యాలెట్ బాక్స్ ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా భావిస్తున్న ఈ బాక్స్‌ను కట్టర్‌తో కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి దీనిని విక్రయించినట్లు దుకాణదారుడు తెలిపాడు.
నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చిందనే అంశంపై అధికారుల విచారణ కోరుతున్నారు.
Next Story




