Miryalaguda: మిర్యాలగూడలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీలు!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యటన. ప్రమాదకర బ్లాక్ స్పాట్లను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

Saleem, Nalgonda
Published on: 5 Aug 2026 4:18 PM IST
Miryalaguda:
X

Miryalaguda: మిర్యాలగూడలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీలు!

మిర్యాలగూడ: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. బుధవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (ఐపీఎస్) క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రమాదాలకు నిలయంగా మారిన ‘బ్లాక్ స్పాట్లను’ స్వయంగా పరిశీలించారు.

​రాష్ట్ర రహదారి-02, జాతీయ రహదారి-167 పరిధిలోని వెల్‌కమ్ టూ మిర్యాలగూడ జంక్షన్, నందిపాడు ఎక్స్ రోడ్డు, చిల్లాపురం, చింతపల్లి క్రాస్ రోడ్లు, జంకుతాడా రోడ్డు, మిర్యాలగూడ అప్రోచ్ రోడ్డు ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులతో చర్చించి, లోపాలను ప్రత్యక్షంగా గుర్తించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story