Nalgonda: గ్రీవెన్స్ డేలో 32 ఫిర్యాదుల స్వీకరణ – ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ 32 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Nalgonda: గ్రీవెన్స్ డేలో 32 ఫిర్యాదుల స్వీకరణ – ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ: బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'గ్రీవెన్స్ డే'లో ఆయన పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భూవివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని, పరిష్కారంలో ఎలాంటి జాప్యం వహించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ తెలిపారు.
Next Story




