Nalgonda: పెద్ద సూరారం చెరువును కృష్ణా జలాలతో నింపాలని డిమాండ్
Nalgonda: నల్గొండ జిల్లా చందనపల్లి దగ్గర కాలువ పూడికను తొలగించి, పెద్ద సూరారం చెరువుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.
Nalgonda: పెద్ద సూరారం చెరువును కృష్ణా జలాలతో నింపాలని డిమాండ్
నల్గొండ: పానగల్లు చెరువు D-39 కాలువ పూడికను వెంటనే తొలగించి, పెద్ద సూరారం చెరువును కృష్ణా జలాలతో నింపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం చందనపల్లి సమీపంలో అడ్డంకిగా మారిన కాలువను రైతు బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు వస్తున్నప్పటికీ, క్రషర్ మిల్లు వద్ద మట్టి, చెట్లు పేరుకుపోవడంతో సూరారం చెరువుకు నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు.
అధికారులు తక్షణం స్పందించి కాలువను శుభ్రం చేయించి, పంటలను, తాగునీటి అవసరాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సైదులు, జానయ్య, రవీందర్, రైతులు మదన్ రెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు.
Next Story




