Nalgonda: జీవో 97పై రగిలిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. నల్గొండలో భారీ ర్యాలీ!
Nalgonda: జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
Nalgonda: జీవో 97పై రగిలిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. నల్గొండలో భారీ ర్యాలీ!
Nalgonda: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగింది.
ర్యాలీ అనంతరం నిర్వహించిన ధర్నాలో విద్యార్థినేతలు మాట్లాడుతూ.. ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా పూర్తయ్యాక బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరే ఈసెట్ (ECET) అవకాశాలకు, ఉన్నత చదువులకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌ను పాత పద్ధతిలోనే ఎస్‌బీటీఈటీ (SBTET) పరిధిలోనే కొనసాగించాలని, ‘శక్తి’ స్కీమ్ పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని డిమాండ్ చేశారు.




