Nalgonda: నల్గొండలో 'డీసీసీ వర్సెస్ మినిస్టర్' రచ్చ: ఫ్లెక్సీల వివాదంతో వేడెక్కిన రాజకీయం!

Nalgonda: నల్గొండలో సీఎం పర్యటన వేళ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Jun 2026 1:11 PM IST
Nalgonda: నల్గొండలో డీసీసీ వర్సెస్ మినిస్టర్ రచ్చ: ఫ్లెక్సీల వివాదంతో వేడెక్కిన రాజకీయం!
X

నల్గొండ: ముఖ్యమంత్రి పర్యటన వేళ నల్గొండ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. 'డీసీసీ వర్సెస్ మినిస్టర్' వివాదం మరోసారి తెరపైకి రావడంతో సర్వత్రా గందరగోళం నెలకొంది.

​మహా ముదురుతున్న ఫ్లెక్సీల వివాదం:

సీఎంకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఫోటో మాయమవ్వడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కైలాష్ నేత.. అసలు ముఖ్యమంత్రి సభకు తనకు అధికారికంగా ఆహ్వానమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ సభకు హాజరై తీరుతానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్ విసిరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story