Nalgonda: ఆదివారం నీట్-పీజీ పరీక్ష - పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్
Nalgonda: నల్గొండలో ఆదివారం జరిగే నీట్-పీజీ పరీక్ష కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
Nalgonda: ఆదివారం నీట్-పీజీ పరీక్ష - పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్
నల్గొండ: నల్గొండ పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న నీట్-పీజీ పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రామగిరి నేతాజీ నగర్లోని ఎస్పీఆర్ పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేశారు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుంది. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, సభలు, ర్యాలీలు, మైకుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. కేంద్రం పరిసరాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని ఆదేశించారు.
Next Story




