Nalgonda: దొంగతనం కేసుల్లో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష: కోర్టు తీర్పు!
Nalgonda: ట్రాక్టర్ల బ్యాటరీలు, బైక్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులకు నల్గొండలోని మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించింది.
Nalgonda: దొంగతనం కేసుల్లో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష: కోర్టు తీర్పు!
నల్గొండ: ట్రాక్టర్ల బ్యాటరీలు, బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితులకు నల్గొండలోని III అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొలి కేసులో సముద్రాల కృష్ణ, షేక్ టిప్పు సుల్తాన్లకు మూడేళ్ల జైలుతో పాటు రూ.500 చొప్పున జరిమానా విధించారు.
రెండో కేసులో సముద్రాల కృష్ణకు మూడేళ్ల జైలు, రూ.500 జరిమానా పడగా, టిప్పు సుల్తాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. సమర్థవంతంగా దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష పడేలా చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నేరస్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story




