Kanagal: కనగల్‌లో దారుణం శ్రావణ శుక్రవారం మాంసం వండలేదని భార్య హత్య!
Kanagal: నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురంలో ఘోరం. శ్రావణ శుక్రవారం మాంసం వండలేదని భార్య లింగమ్మను దారుణంగా హత్య చేసిన భర్త లింగయ్య.
Kanagal: కనగల్‌లో దారుణం శ్రావణ శుక్రవారం మాంసం వండలేదని భార్య హత్య!
Kanagal: మాంసం వండలేదని భార్య దారుణ హత్య శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో మాంసం వండటానికి నిరాకరించిందన్న కోపంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురంలో జరిగింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కారింగ్ లింగయ్య శుక్రవారం మాంసం తెచ్చి వండాలని భార్య లింగమ్మ (65)ను కోరాడు. పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు మాంసం వండనని ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
రాత్రి వేళ లింగమ్మ నిద్రిస్తున్న సమయంలో లింగయ్య పదునైన ఆయుధంతో ఆమె తలపై తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




