Nalgonda: ఐటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు!
Nalgonda: నల్లగొండ జిల్లా ఐటిపాముల వద్ద జాతీయ రహదారిపై కారు ప్రమాదం. మియాపూర్‌కు చెందిన తాతా మనవడికి తీవ్ర గాయాలు, నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
Nalgonda: ఐటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు!
Nalgonda: నల్లగొండ జిల్లా ఐటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టిన కారు. నందిగామ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. కారులో చిక్కుకున్న వారిని శ్రమించి బయటకు తీసిన పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మియాపూర్ వాసులు విశ్వేశ్వరరావు (50), ఆయన మనవడు జై కర్ (25)గా గుర్తింపు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.




