Nalgonda: నల్లగొండలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహణ!
Nalgonda: నల్లగొండలో ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీని డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, సీఐ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఘనంగా అన్నదానం, స్వీట్ల పంపిణీ నిర్వహించారు.
Nalgonda: నల్లగొండలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహణ!
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మిలాద్ జూలూస్ కమిటీ అధ్యక్షుడు సల్మాన్ ఖాద్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ (అమేర్), వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
దర్గా మెట్ల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గడియారం సెంటర్, ఆర్పీ రోడ్డు, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ బజార్ మీదుగా సాగింది. హైదరాబాద్‌కు చెందిన నాత్ గాయకుల గానంతో పురవీధులు మార్మోగాయి. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావ సందేశాలను చాటుతూ భక్తులు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం దర్గా మెట్ల వద్ద 300 మందికి అన్నదానం నిర్వహించారు.
Next Story




